Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
యువతకు ఉద్యోగ నోటిషి కేషన్, నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆర్అండ్బీ గెస్ట్ హౌజ్ ఎదుట బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. బీజేవైఎం పట్టణాధ్యక్షులు మల్యాల వంశీ కృష్ణ అధ్యక్షతన చేపట్టిన సంతకాల సేకరణలో రేవూరి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్థానాలను తుంగలో తొక్కారన్నారు. ప్రత్యేకించి నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగ నియమాకాలు, నిరుద్యోగ భృతి వంటి ప్రధాన హామీలను నేటికీ అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి త్వరలో యువత గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్డెపల్లి నరసింహారాములు, రైల్వే బోర్డు మెంబర్ రేసు శీనివాస్, బీజేపీ పట్టణాధ్యక్షులు అధ్యక్షులు బాల్నే జగన్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శులు గూడూరు సందీప్, సామల ప్రవీణ్, ఉపాధ్యక్షుడు బొడిగే ఈశ్వర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.