Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రధాన కార్యదర్శిగా పెండెం రాజు
నవతెలంగాణ-కాశిబుగ్గ
తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెండెం రాజు ఎన్నికయ్యారు. హనుమకొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రవీందర్ రాజు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సంఘం రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ హాజరయ్యారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఖాళీలు ఏర్పడిన స్థానాల్లో నూతన సభ్యులను ఎన్నుకున్నట్లు సీహెచ్ రవీందర్ రాజు తెలిపారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా ఎస్.జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా పెండెం రాజు, కోశాధికారిగా కిరణ్ కుమార్, కార్యదర్శులుగా నవీన్ కుమార్, మల్లిక్ ఆడిట్ కమిటీ సభ్యులుగా శ్రీనివాస్, భాస్కర్ రావులను ఎన్నుకున్నారు. నూతన కార్యదర్శిగా ఎన్నికైన రాజు మాట్లాడుతూ.. జిల్లాలోని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకంతో పదవి అప్పగించిన సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులకు కతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు సదాశివ రెడ్డి, రవీందర్, స్టాలిన్, మోజెస్, సదానందం, చంద్రయ్య, విశ్వనాధ్, రాందాస్ పాల్గొన్నారు.