Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
ముప్పారం శివారులోని ఫైరింగ్ రేంజ్ స్థలాన్ని ఆదివారం పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నేండ్ల నుంచి మామునూరు జక్కులొద్ధి ప్రాంతములోని ఏపీఎస్పీ నాల్గవ బెటాలియన్‌లో ఫైరింగ్ శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ఇక మీదట సొంత స్థలంలో ఫైరింగ్ శిక్షణ పొందేందుకు అవసరమైన ఫైరింగ్ రేంజ్ నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ముప్పారం గ్రామ శివారులో గతంలో ప్రభుత్వం వరంగల్ కమిషనరేట్‌కు మంజూరు చేసిన స్థలంలోనే ఫైరింగ్ రేంజ్ నిర్మాణాలు చేపట్టాలని ఉద్దేశంతో ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ స్థలంలో సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం చేపట్టాలని, ఫైరింగ్ రేంజ్ అవసరమైన వసతుల నిర్మాణం కోసం అధికారులు ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీలు భీంరావు, సంజీవ్, ట్రాఫిక్ ఏఆర్ ఏసీపీలు శ్రీనివాస్, బాలస్వామి, నాగయ్య, సీఐ రమేష్ కుమార్ యాదవ్, ఆర్ఐ నగేష్‌తో పాటు రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.