Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని కారుకొండ గ్రామంలో న్యూడెమోక్రసీ నాయకుడు చేపూరి రంగన్న స్మారక భవనానికి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఐలయ్య మాట్లాడారు. కారుకొండ కేంద్రంగా బయ్యారం ఏజెన్సీలో ఆదివాసీ పేదల కోసం రంగయ్య కమ్యూనిస్టు కార్యకర్తగా విశేష కృషి చేశాడని తెలిపారు. ఆదివాసీలకు పోడుభూములు ఇప్పించడం, అటవీ దాడులకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలు నిర్మించడంలో ముందున్నారని చెప్పారు. ప్రజల కోసం జీవితాంతం పని చేశాడని కొనియాడారు. ఆయన స్మారకంగా ప్రజల సహకారంతో ప్రజాఉద్యమ కేంద్రంగా భవన నిర్మాణం చేపడతామని చెప్పారు. అనేక నిర్బంధాలను ఎదుర్కొని శ్వాస ఉన్నంత వరకు విప్లవ కమ్యూనిస్టుగా ప్రజాహృదయాల్లో నిలిచిన రంగయ్య ఆశయ సాధన కోసం పాటుపడాలని కోరారు. భవన నిర్మాణానికి ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు మోకాళ్ల మురళీ క్రిష్ణ, మదార్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సనప పొమ్మయ్య, మండల అధ్యక్షుడు బానోత్ నర్సింహ, పార్టీ ఏజెన్సీ మండల నాయకులు పూనెం లింగన్న, మేకపోతుల నాగేశ్వర్రావు, పాయం సమ్మయ్య, గంగారపు భిక్షపతి, అర్రెం కోటమ్మ, బోనగిరి మధు, భూక్యా శంకర్, గన్యా, తదితరులు పాల్గొన్నారు.