Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్యూలైన్ల ద్వారా దర్శనాలు
నవతెలంగాణ-తాడ్వాయి
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తజనం తరలివస్తున్నారు. ఈనెల 16 నుంచి మహాజాతర మొదలవ్వనున్నా.. ఇప్పటికే మేడారం కిటకిటలాడుతోంది. సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద భక్తులు కిక్కిరిసిపోయారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవం కన్నులపండువగా సాగుతోంది. పెద్దఎత్తున తరలివస్తున్న భక్తజనంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఆదివారం భక్తుల పుణ్యస్నానాలతో జంపన్న వాగు కళకళలాడుతోంది. భక్తులంతా సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. చాలా మంది నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తున్నారు.
కరోన నియమ నిబంధనల ప్రకారం దర్శనాలు
ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల మేడారంలో దుకాణాలను మూసివేశారు. బెల్లం, మంచినీళ్లు, పసుపు, కుంకుమ వంటి అత్యవసరమైన వస్తువులు మాత్రమే విక్రయిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులంతా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులంతా మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.