Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
ఈనెల 11న జనగామలో తలపెట్టిన సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కోరారు. స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌజ్‌లో నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి 40 వేల మందిని సమావేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని నాయకులకు దిశానిర్ధేశం చేశారు. సమావేశంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, పీఏసీఎస్ చైర్మెన్ కాకిరాల హరిప్రసాద్, ఈదురు ఐలయ్య, మున్సిపల్ చైర్మెన్ రామచంద్రయ్య, వైస్ చైర్మెన్ సురేందర్‌రెడ్డి, సీనియర్ నాయకుడు పోనుగోటి సోమేశ్వర్రావు, కేతిరెడ్డి సోమ నర్సింహారెడ్డి, జాటోత్ నెహ్రూనాయక్, అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, ఇట్టె శ్యాంసుందర్‌రెడ్డి, కుర్ర శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
సభను జయప్రదం చేయాలి : ఈదురు
ఈనెల 11న జనగామలో తలపెట్టిన సీఎం కేసీఆర్ బహిరంగ సభను జయప్రదం చేయాలని టీఆర్ఎస్ పార్టీ పెద్దవంగర మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య కోరారు. మండల కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఐలయ్య పాల్గొని మాట్లాడారు. మంత్రి దయాకర్‌రావు ఆదేశాల మేరకు అన్ని గ్రామాల ఉనంచి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తరలిరావాలని కోరారు. సమావేశంలో పాలకుర్తి ఆలయ కమిటీ చైర్మెన్ రామచంద్రయ్య శర్మ, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పాలకుర్తి యాదగిరిరావు, మండల ఉపాధ్యక్షుడు బంధు వెంకన్న, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకన్న, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజరు, ఎదునూరి శ్రీనివాస్, శ్రీరామ్ సుధీర్, సర్పంచ్‌లు చింతల భాస్కర్, జాటోత్ చిలకమ్మా హేమని, తదితరులు పాల్గొన్నారు.