Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిలిచిపోయిన వాహనాలు
నవతెలంగాణ-బయ్యారం
రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అందజేస్తున్న దళితబంధు పథకాన్ని అర్హులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీల ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో ప్రధాన రహదారి పై ధర్నా నిర్వహించడం జరిగింది. దళిత బంధు పథకం కింద ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. ఇల్లందు నియోజకవర్గంలో దళిత బంధు అమలు కోసం లబ్ధిదారుల ఎంపిక జాబితా విడుదలయ్యాయి. అయితే ఈ పథకం లబ్ధిదారులుగా కొందరిని మాత్రమే ఎంపిక చేయడం పట్ల మండలంలోని దళితులు ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఇల్లందు-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. దళితులందరికీ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనకారులకు లంబాడీల ఐక్య వేదిక సంఘం మండల అధ్యక్షుడు జర్పుల శ్రీను, సేవాలాల్ సేన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవి నాయక్ వారి సంఘాల తరుపున మద్దతు తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఆందోళనకారులతో చర్చించి ధర్నా విరమింపజేశారు.