Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిన్నగూడూరు
పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు మూల మురళీధర్‌రెడ్డి, సర్పంచ్ శిరీష మంగీలాల్ తెలిపారు. మండలంలోని పగిడిపల్లిలో ఈజీఎస్ ద్వారా చేపట్టిన అంతర్గత రోడ్డు పనులను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామ అభివద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీరయ్య, మాజీ సర్పంచ్ బావ్‌సింగ్, పార్టీ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రవీందర్, నాయకులు వెంకన్న, బాలమల్లు, వెంకన్న, వెంకట్‌రెడ్డి, వీరన్న, వీరయ్య, నరేష్, సోమయ్య స్వరూప, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.