Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏఆర్ ఏసీ రెస్టారెంట్ ప్రారంభం
నవతెలంగాణ-నర్సింహులపేట
నిరుద్యోగ యువత స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ రోడ్డులో ఏర్పాటు చేసిన ఏఆర్ ఏసీ రెస్టారెంట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. నిరుద్యోగ యువకుడు సంతోష్ రెస్టారెంట్ ఏర్పాటు చేసి మరో నలుగురికి ఉపాధి కల్పించడం అభినందనీయమని చెప్పారు. మండల ప్రజలకు రుచికరమైన వంటకాలు అందుబాటులోకి రావడం శుభపరిణామమని తెలిపారు. మహానగరాల్లో తరహాలో మండల కేంద్రంలో రెస్టారెంట్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ టేకుల సుశీల యాదగిరిరెడ్డి, వైస్ ఎంపీపీ దేవేందర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైదం దేవేందర్, యూత్ మండల అధ్యక్షుడు సురేష్ నాయక్, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు రవినాయక్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు జగదీశ్వర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.