Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
వివిధ శాఖల సమన్వయంతో మేడారం జాతరలో భక్తుల సౌకర్యాలు ముగింపు దశలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. మేడారం జాతర పర్యటనలో భాగంగా భక్తుల సౌకర్యాలను భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్, ఏఎస్పీ సుధీర్ కేకన్, తదితరులతో కలిసి సౌకర్యాలను సోమవారం పరిశీలించారు. ఐటీడీఏ గెస్ట్‌హౌజ్ ఎదుట నిర్మాణం పూర్తి దశలో ఉన్న రెవిన్యూ గెస్ట్ హౌస్, ఆర్డబ్ల్యూఎస్ క్యాంప్ ఆఫీస్, పూజారులు వసతి గహాలను పరిశీలించారు. అనంతరం ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ను సందర్శించి మేడారం జాతరలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది వసతి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వారికి భోజన, ఇతర ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అనంతరం జంపన్న వాగు స్థానాలు ఘట్టాలను పరిశీలించి జంపన్నవాగులో భక్తుల స్థానాలు ఆచరించే ప్రాంతంలో వాటర్ సదుపాయం నిరంతరం కొనసాగాలని ఆ ప్రాంతమంతా విద్యుత్ కాంతులతో ఉండాలన్నారు చిలకలగుట్ట ప్రాంతాన్ని పరిశీలించి వన దేవతలు ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకు వచ్చేటప్పుడు ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా సంబంధిత ఎలక్ట్రిసిటీ అధికారులతో చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నిర్మాణాలు శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో శాశ్వత నిర్మాణాలపై దష్టి సారించి వేగవంతంగా పూర్తి చేసే దిశగా అధికారులకు సమన్వయంతో పని చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, దేవదాయ శాఖ ఈఓ రాజేందర్, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ హేమలత, డీపీఓ వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.