Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
నవతెలంగాణ-తొర్రూరు
రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని పెద్దవంగర మండలంలోని గంట్లకుంటలో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనంతగా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. మార్చిలోగా నిర్మాణాలు పూర్తి చేస్తే బిల్లులు త్వరగా రావడంతోపాటు మళ్లీ కొత్త పనులకు నిధులు మంజూరౌతాయని చెప్పారు. ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న అభివద్ధిని చూడాలని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.