Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
మావోయిస్టులు పోలీసులను మార్చేందుకు అమర్చిన మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 6న మావోర ుుస్టు పార్టీ అగ్రనాయకులు బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కొయ్యాడ సాంబయ్య ఆదేశాల మేరకు జేఎంఎండబ్ల్యూపీ డివిజనల్ కమిటీ నాయకులు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకన్న, కుర్సం మంగు అలియాస్ భద్రు, వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీకి చెందిన ముచకి ఉంగళ్ అలియాస్ రఘు అలి యాస్ సుధాకార్, దినేశ్ అలియాస్ దేవ, కారం బుద్రి రీటా, శ్యామల దులే, కుంజం ఇడుమ, దీపక్, జమున, పూజారి కంకెర్ అర్పిసి సభ్యులు, మరికొంత మంది మిలీషియా సభ్యులు కలిసి కూంబింగ్ చేసుకుంటూ వచ్చే పొలీసు పార్టీని చంపాలనే ఉద్దేశంతో సాయుధులై సమావేశమై వాజేడు మండలంలోని పెనుగోలు గ్రామంలోని రిజర్వు ఫారెస్ట్‌లో మందు పాతరలు అమర్చి నట్టు సమాచారం అందడంతో వెంకటాపురం సీఐ శివప్రసాద్, ఎస్ఐ తిరుపతిరావు, వాజేడు ఎస్ఐ హరీష్‌లతోపాటు సీఆర్పీఎఫ్, బీడీ టీము లు పెనుగోలు అటవీ ప్రాంతం లో కూంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామున పెనుగోలు నుంచి పాము నూరు దారిలో మందుపాతరకి అమర్చే ఎలక్ట్రిక్ వైర్ కనిపించగా బీడీ సిబ్బంది తనిఖీ చేసి బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశారు. ఆ ప్రదేశంలో తవ్వి ప్రెజర్ కుక్కర్, 20 మీటర్ల కార్డ్క్స్ వైర్, రెండు డిటోనేటర్లు, ఎలక్ట్రికల్ స్విచ్, బిగ్ బ్యాటరీ సీట్, 33 బ్యాటరీలు, 3 ఎలక్ట్రికల్ వైర్ బిండెల్లు, కెమెరా ఫ్లాష్, మెజరింగ్ టెస్టింగ్ మీటర్, 5 మదర్ బోర్డ్‌లు, 150 మదర్ బోర్డు పిన్స్, తదితర సామాగ్రి లభించిందని ఎస్పీ చెప్పారు. మావోయిస్టుల చర్యల వల్లే బిల్ట్ ఫ్యాక్టరీ మూతపడి అనేక కుటుంబాలు జీవనో పాధిని కోల్పోయాయని ఎస్పీ అన్నారు. కార్యక్ర మంలో ఓఎస్డీ శోభన్ కుమార్, ఏటూరు నాగారం ఏఎస్పీ అశోక్ కుమార్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ తాహెర్, వెంకటాపురం ఇన్స్పెక్టర్ శివప్రసాద్, వాజేడు ఎస్సై తిరుపతి రావు, ఎస్ఐ హరీష్ తదితరులు పాల్గొన్నారు.