Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని నారాయణపురం పంచాయతీ సెక్రెటరీ ఈసం వెంకటేశ్వర్లు కుటుంబాన్ని స్వగ్రామమైన పాత ఇర్సులాపురంలో డీసీసీ అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి, ఇల్లందు నియోజకవర్గ నాయకుడు డాక్టర్ రామచంద్రనాయక్ సోమవారం పరామర్శించారు. తొలుత వారు వెంకటేశ్వర్లు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం భరత్చంద్రారెడ్డి, రామచంద్రనాయక్ మాట్లాడారు. వెంకటేశ్వర్లు మృతికి కారకులైన ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ కంబాల ముసలయ్య, శ్రీనివాసరెడ్డి, గణేష్, కేతమల్లు, కోడి వీరన్న, తదితరులు పాల్గొన్నారు.