Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని మండల విద్యాశాఖ కార్యాలయం సమావేశ మందిరంలో ఎంఈఓ రాంకిషన్రాజ్ అధ్యక్షతన ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హెచ్ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు మాట్లాడారు. సమాజంలో యువతను నిర్విర్యం చేస్తున్న 4జీ (గంజాయి, గుడుంబా, గుట్కా, గ్యాంబ్లింగ్)తో పాటు మత్తు పదార్థాలను నియంత్రించుటలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. 4జీ వల్ల కలిగే దుష్పరిణామాలు యువతను నిర్విర్యం చేసేందుకు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టడంలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలన్నారు. మత్తు పదార్థాల నియంత్రణలో ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా పనిచేసి సత్ప్రవర్తన కలిగిన యువతను దేశానికి అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై దేశిని విజరుకుమార్, ఎక్సైజ్ అధికారులు బాలకిషన్, వివిద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.