Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
కాంగ్రెస్, టీఆర్ఎస్ల నుంచి 30 మంది బీజేపీలో చేరినట్టు ఆ పార్టీ మండల అధ్యక్షుడు మద్దినేని తేజరాజు తెలిపారు. మండలంలోని మొట్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని టప్పమంచలో తేజరాజు ఆద్వర్యంలో శక్తి కేంద్రం ఇన్ఛార్జి అలుగుబెల్లి పూర్ణయ్య సమక్షంలో కాంగ్రెస్, టీఆర్ఎస్లకు చెందిన వార్డు సభ్యులు బిల్లా కష్ణ మోహన్, యాలం ఉపేంద్ర, టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు పులుసం ప్రసాద్, యాలం చంద్రయ్య, సోలం యాదగిరి, పులుసం నాగరాజు, ఊకె రామనాధం, యాలం అనిత, మంతెన సమ్మక్క, తెల్లం వెంకన్నతోపాటు 30 మంది బీజేపీలో సోమవారం చేరారు. ఈ సందర్భంగా పార్టీ అనుబంధ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు, మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగూల్ మీరా, గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఈక జగ్గారావు, యువ మోర్చా మండల అధ్యక్షుడు వేల్పురి సత్యనారాయణ, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు రమాదేవి, మొట్లగూడెం బూత్ అధ్యక్షుడు వాసం స్వామి, పసర బూత్ అధ్యక్షుడు పసుల బాబురావు తదితరులు పాల్గొన్నారు.