Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం
మండలంలోని వట్టి వాగు బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. మండలంలోని చిన్నబోయినపల్లి నుంచి ఐలాపూర్ వరకు చేపట్టిన రోడ్డు పనులను, షాపల్లి వద్ద వట్టివాగు బ్రిడ్జి నిర్మాణ పనులను ఆమె పరిశీలించి మాట్లాడారు. చాలా ఏండ్లుగా వర్షాకాలంలో శాపల్లి, కొత్తూరు దొడ్ల, దొడ్ల, మల్యాల, గోవిందరావు కాలనీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ బ్రిడ్జి ప్రజలకు పది కాలాలపాటు ఉపయోగపడుతుందని తెలిపారు. ఐలాపూర్ రోడ్డును పరిశీలించి వాగులపై బ్రిడ్జీలను నిర్మించాలని, త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐలాపూర్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. రాత్రివేళల్లో అటవీ జంతువులు, పాములు, తేళ్లు సంచిస్తున్నాయని తెలిపారు. ఐలాపూర్ రోడ్డు నిర్మాణం చేపట్టడంలో అటవీ శాఖ అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు, కన్నాయిగూడెం జెడ్పీటీసీ నామ కరంచంద్ గాంధీ, జిల్లా నాయకులు ఖలీల్ ఖాన్, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్, తదితరులు పాల్గొన్నారు.