Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అనాథలైన ముగ్గురు చిన్నారులు
అ కొయ్యూర్ పోలిస్స్టేషన్లో కేసు నమోదు
నవతెలంగాణ-మల్హర్రావు
అత్తమామలు, భర్త వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రుద్రారం గ్రామపంచాయతీ పరిధి పాత రుద్రారంలో సోమవారం చోటుచేసుకుంది. మతురాలి కుటుంబ సభ్యులు, కొయ్యుర్ పోలీసుల పూర్తి కథనం ప్రకారం... పాతరుద్రారానికి చెందిన వివాహిత దుర్గం లక్ష్మీ (23)ని తన భర్త దుర్గం రాజుకుమార్, అత్తమా మలు తరుచూ వరకట్నం తీసుకరావాలని నాలుగేండ్లుగా వేధిస్తున్నారు. పలుమార్లు పంచాయతీలు పెట్టినా ఫలితం లేకపోయింది. ఈక్రమంలో వారి వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. చుట్టుప్రక్కల వారు గమనించి 108 సమాచారం ఇచ్చేలోపే ఆమె మతి చెందింది. మతురాలికి 2016లో రాజు కుమార్తో వివాహం కాగా వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తల్లి మతి చెంద డంతో చిన్నారులు అనాధాలయ్యారు. మతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాజుకుమార్తోపాటు అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యూర్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.