Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తహసీల్ధార్ ఎండీి ఇక్బాల్
అ ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు
నిలిపివేసిన రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ-భూపాలపల్లి
కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తహసీల్ధార్ ఎండీ ఇక్బాల్ హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 268 సర్వే నెంబర్ లో 27 గుంటల ప్రభుత్వ సీలింగ్ భూమి లో అక్రమ నిర్మాణాలు చేపడు తున్నారనే కారణంతో రెవెన్యూ అధికారులు సోమవారం నిర్మాణాలను నిలిపివేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భూపాలపల్లి తాసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను సీజ్ చేసి స్టేటస్కో చేయాల్సిందిగా తహసీల్ధార్తోపాటు భూపాలపల్లి మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ అవినాష్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు 268 సర్వేనెంబర్‌లోని నిర్మాణాలను సీజ్ చేశారు. అక్రమ కట్టడాలు జరుగుతున్నాయనే కారణాలతో సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి అవినాష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామస్వామి, రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.