Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
75 గంటల్లో యుద్ధప్రాతిపదికన పార్కు పనుల ను పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ బల్దియా మేయర్ గుండు సుధారాణి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశిం చారు. బల్దియా పరిధి 13వ డివిజన్ ఎంహెచ్‌నగర్ (మోటూరి హనుమంతరావునగర్)లో నిర్మిస్తున్న పిల్లల మైక్రో పార్కును సోమవారం మేయర్ పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి సమర్థవంతంగా పనులు చ చేపట్టఏందుకు అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. నర్చరింగ్ నైబర్ హుడ్ ఛాలెంజ్ కార్యక్రమం, స్మార్ట్ సిటీ పథకం లో భాగంగా గాస్లం ప్రాంతంలో పిల్లలకు ఆహ్లాదాన్ని అందించాలని అన్నారు.
వారిలో కాగ్నిటివ్,మోటో స్కిల్స్‌ను అభివద్ధి చేయడానికి పిల్లల మైక్రో పార్కును పూర్తి చేయాలన్నారు. తక్కువ స్థలంలో పార్క్‌ను నిర్మిం చడానికి రూపకల్పన చేశామన్నారు. తల్లులు, పిల్లలు ఒక ఆహ్లాద్దకరమైన వాతావరణంలో ఉండేలా పార్క్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఆజాదికా అమృత్ మహౌత్సవ్‌లో భాగంగా తక్కువ కాలవ్యవధిలో పార్క్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. గ్రీనరి పను లను కూడా వెంటనే పూర్తి చేయాలని సీహెచ్‌ఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ సత్యనారాయణ, సీహెచ్ఓ సునిత, ఈఈ శ్రీనివాస్, డీఈ శ్రీనాథ్, ఏఈ కార్తిక్‌రెడ్డి, డబ్లూఆర్ఐ ఇండియా కన్సల్టెంట్ జస్వంత్, తదితరులు పాల్గొన్నారు.