Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తరిగొప్పుల
ఈనెల 11వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా పర్యటన ఉన్నందున కార్యకర్తలు అందరూ కలిసి సభను విజయవంతం చేసేలా కృషిచేయాలని ఎమ్మెల్సీ బండ ప్రకాష్ సూచించారు. మంగళశారం నర్మెట మండల కేంద్రంలోని వినాయక గార్డెన్లో ఉమ్మడి మండల కన్వీనర్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తరిగొప్పుల. నర్మెట ఉమ్మడి మండలాల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, చింతకింది సురేష్, పీఏసీఎస్ డైరెక్టర్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, తరిగొప్పుల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బీరెడ్డి జార్జిరెడ్డి, జిల్లా నాయకులు జొన్నగొని సుదర్శన్ గౌడ్, నరసింహారావు, సర్పంచులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.