Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
మండలంలోని అంబట్పల్లి గ్రామ పంచాయితి పరిధిలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె పకృతి వనాన్ని ఎంపీడీఓ శంకర్‌నాయక్ మంగళవారం సందర్శించారు. మొక్కలు నాటే ప్రకక్రియను పూర్తి చేయాలని కార్యదర్శికి సూచించారు. నిత్యం మొక్కలకు నీరు పట్టేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలని వాచర్లకు సూచించారు. మొక్కలు చనిపోతే వాటి స్థానంలో తిరిగి మొక్కలు నాటాలన్నారు. అనంతరం సూరారం గ్రామ పంచాయతీ పరిధి వన నర్సరీని సందర్శించారు. ఆయనవెంట ఏపీఓ కుమారస్వామి, సర్పంచ్ లక్ష్మారెడ్డి టెక్నికల్ అసిస్టెంట్ రాజు, ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శులు పి లక్ష్మి, అంజలి, సూరారం సర్పంచ్ నాగుల లక్షారెడి ఉన్నారు