Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
ఇండోర్ స్టేడియం లో కొనసాగుతున్న మరమ్మతు పనులను నగర మేయర్ గుండు సుధారాణి మంగళవారం పరిశీ లించారు. సమర్ధవంతంగా నిర్వ హించడానికి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మహిళలు కూడా వ్యాయామశాలలో కసరత్తులు చేసుకునేలా సమయాన్ని కేటాయించాలని, ఇండోర్ ఆటలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. బాస్కెట్ బాల్,వాలీబాల్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్విమ్మింగ్ పూల్‌తోపాటు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌గా తీర్చిదిద్దాలన్నారు. సెంట్రల్ వేర్ హౌస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడల సాధనకు వచ్చే క్రీడాకారుల జాబితాను ఆన్లైన్లో నమోదుచేయాలన్నారు. గతం లో వివిధ క్రీడాంశాలకు సంబంధించి ఆటగాళ్లు చెల్లించే ఫీజు వివరాలను కోచ్‌ల నుండి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఇండోర్ స్టేడియం సిబ్బంది హాజరు ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ కిషోర్, ఏఈ కార్తిక్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ రవి, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు.
.