Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యువజన కాంగ్రెస్ రాష్ట్రనేత కీసర దిలీప్‌రెడ్డి
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
జిల్లాకు గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వకుంటే ఈ నెల 11న సీఎం కేసీఆర్ పర్యటనను అడ్డుకునితీరుతామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర దిలీప్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు బస్వగాని అనిల్ అధ్యక్షతన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018 సార్వత్రిక ఎన్నికలముందు జిల్లాకు అనేక హామీలు ఇచ్చారని, నియోజకవర్గ కేంద్రంలో 26నవంబర్ 2018ననిర్వహించిన బహిరంగ సభల్లో మెగా లెదర్ పార్కు ద్వారా ఉపాధి కల్పిస్తామని, వంద పడకల దవాఖానను ఏర్పాటుకు జీఓ తెస్తామన్న హామీలు నేడు తుంగలో తొక్కి జిల్లాకు రావడం సిగ్గుచేటన్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో ప్రారంభకార్యక్రమం చేసింది నిజం.. కాదా... అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. చీటకోడూర్ సంపత్, నలిమేల ఏలీయా, ఎడ్ల భాస్కర్, చంద్రశేఖర్, ఐలపాక శ్రీనివాస్, వసంత్, నున్ను, రంజిత్ పాల్గొన్నారు.