Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్ కుమార్
నవతెలంగాణ-పాలకుర్తి
జనగామ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలతోపాటు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలను మంజూరు చేసి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతనే సీఎం కేసీఆర్ జనగామలో అడుగుపెట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దడిగే సందీప్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి ఆయన మాట్లాడారు. 2018 ఎన్నికలప్పుడు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. నాడు పాలకుర్తి సభలో ఎర్రబెల్లి దయాకర్ రావును గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తానని హామీనిచ్చి విస్మరించారన్నారు. కానీ జిల్లా కేంద్రంలో గల కలెక్టర్ కార్యాలయం ప్రారంభానికి రావడం విడ్డూరంగా ఉందన్నారు. హామీలు అమలు చేయని సీఎం కేసీఆర్ ను జిల్లాలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను, నర్సింగ్ కాలేజీని, పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలన్నారు. లేదంటే 11 న కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం రాస్తారోకో చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను ఎస్సై వంశీకృష్ణ అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లావుడియా అనిల్ చౌహాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మాలోతు తరుణ్, శ్రావణ్, సందీప్, యాకన్న, నరసింహ, 500మంది విద్యార్థులు పాల్గొన్నారు.