Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ తూర్పు నియోజక వర్గానికి చెందిన స్లమ్ ఏరియా ఎంహెచ్నగర్ లో 75 గంటల్లో చిల్డ్రన్ పార్క్ నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారు. మంగళవారం పార్కు పనులను ఆయన పర్యవేక్షించి మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో స్లామ్ ప్రాంతమైన ఎంహెచ్నగర్ను ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్లో భాగంగా స్మార్ట్ సిటీ లో ఎంపిక చేసిన స్థలంలో డంప్ యార్డ్ నిర్మాణం గానీ, చిల్డ్రన్ పార్క్ నిర్మాణం గానీ పూర్తి చేయాలనే పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. ఇందుకు ఎంహెచ్నగర్ను ఎంపిక చేసినందుకు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని స్లమ్ ఏరియాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. పోటీల్లో ఎంహెచ్నగర్లోని చిల్డ్రన్ పార్క్ బహు మతి గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్ జోషి, టీఆర్ఎస్ నాయకులు గందే నవీన్ పాల్గొన్నారు.