Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ జనగామ జిల్లాకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి అన్నారు. మంగళవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో మంగళంపల్లి జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాజారెడ్డి మాట్లాడారు. జనగామలో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కళాశాలలకు మంత్రి దయాకరరావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యదగిరిరెడ్డి బాధ్యత తీసుకొని మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న చరిత్ర కలిగిన జనగామకు ఉద్యమాలు కొత్తకాదని, సీఎం కేసీఆర్ చేత ప్రకటన చేయించలేకుంటే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి,యువజన,ప్రజా సంఘాలు ఆందోళన బాట పట్టారని, వ్యాపార ,విద్యా,వైద్య, హౌటళ్లు, సంస్థలు స్వచ్చందంగా బంద్ పాటించి నిరసన తెలపాలని అన్నారు. ఇందుకు సీపీఐ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని అన్నారు. పాతూరి సుగుణమ్మ, అది సాయన్న, శ్రీనివాస్, సోమయ్య, విజయకుమార్, సదానందం పాల్గొన్నారు.