Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ఆర్థిక ఒత్తిడిలకు తట్టుకోనైనా సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అమలు చేస్తూ ఆడబిడ్డకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో 141మంది కళ్యాణలక్ష్మీ పథకం లబ్ధిదారులకు రూ.కోటి14లక్షల16వేల విలువజేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్రంలో పేదలకు, రైతులకు ఎక్కడ రాజీపడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆడబిడ్డల పెండ్లికలు తనను ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాన న్నారు. ప్రభుత్వ కానుకను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పి పవన్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీ కిషన్, తహసీల్ధార్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.