Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి సత్యనారాయణరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి మున్సి పాలిటీ పరిధి ఓసీ-2 ప్రభావిత ప్రాంతాలైన శాంతి నగర్, హనుమాన్‌నగర్ కాలనీ వాసులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్య నారాయణరావు డిమాండ్ చేశారు. మంగళవారం కాలనీవాసులు చేపట్టిన ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఓసీ-2 లో జరుగుతున్న బాంబు పేలుళ్ల వల్ల కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని పలుమార్లు కలెక్టర్, ఆర్డీఓ, సింగరేణి జీఎంకు విన్నవించినా పట్టించుకోలేదన్నాఉ. 2013 భూ సేకరణ చట్టం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద కాలనీని తరలించి ఇండ్ల స్థలాలు, నష్టపరిహారం చెల్లించాలన్నారు. స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. లేదంటే ఓసీ ఉత్పత్తిని నిలిపివేసి కాలనీవాసులు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు దేవన్, జిల్లా నాయకులు అంబాల శ్రీను,రాజు, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు తోట రంజిత్, మహేందర్, హాఫిజ్, విజరు, చరణ్, పృథ్వి, ఆంజనేయులు, తిరుపతి, తదిరతులు పాల్గొన్నారు.