Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సమావేశంలో గళంవిప్పిన ప్రజాప్రతినిధులు
అ సమన్వయంతో ముందుకెళ్లాలి : ఎంపీపీ
నవతెలంగాణ-మల్హర్రావు
అభివృద్ధి పనులకు ఇసుక అనుమతులు ఇవ్వరాని ప్రజాప్రతినిధులు రెవెన్యూ అధికారులపై మండి పడ్డారు. మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్ల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా అన్నిశాఖల అధికారులు మూడు నెలల ప్రగతి నివేదికలను వినిపించే క్రమంలో ప్రజాప్రతి నిధులు అధికారులను నిలదీశారు. పల్లెప్రగతి అభివద్ధి పనులకు ఇసుక అనుమతులు ఇవ్వడం లేదని, కానీ లంచాలు ఇస్తే అక్రమ ఇసుక రవాణాకు అనుమతులు ఇస్తున్నారని సర్పంచ్లు సిద్ది లింగమూర్తి, శనిగల రమేష్,కొప్సన్ మెంబర్ ఆయుబ్ ఖాన్, ఎంపీటీసీ సభ్యులు రాణి, కల్పన రెవెన్యూశాఖ అధికారులను నిల దీశారు. ఇసుక అక్రమ వ్యాపారంలో డిప్యూటీ తహసీ ల్దార్ అత్యుత్సాహం చూపుతూ తమ పట్ల ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారాని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిచెర్ల, వల్లేంకుంట, ఎడ్లపల్లి గ్రామాల్లో ప్రమాద కరంగా ఉన్న విద్యుత్ సమస్యల పరిష్కరించట్లేదన్నారు. అడ్వాలపల్లి,గాదంపల్లి గ్రామాల్లో విద్యుత్ మీటర్లు చెడిపోయి మోటర్లకు వేలల్లో బిల్లులు వస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడం లేదన్నారు. 2014లో ఎన్ఆర్ఐఈజీస్ నిధులతో కొయ్యుర్ శ్రీశక్తి భవనం నిర్మాణం చేస్తే నేటికి ఇంకా రూ.16 లక్షల బిల్లులు రాలేదని కొప్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు , ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు వెళుతూ మండల అభివృద్ధికి కషి చేయాలని ఎంపీపి సూచిం చారు. సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమయ పాలన పాటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి డుమ్మా కొట్టిన అధికా రులపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. జాతర తరువాత అభివృద్ధి పనులకు ఇసుకకు ఇప్పించేదుకు రెవెన్యూ అధికారులతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. తహశీల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి మహేష్, ఏఈ హరిత, సూపర్వైజర్ సరస్వతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.