Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్మెట్ట
మండలం లోని సూర్యబండతండా గ్రామ పరిధి అమర్సింగ్తండాకు చెందిన భూక్య రాజన్న అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పరామర్శించి రూ.2లక్షల విలువైన ఎల్ఓసీని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనగామ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గుజ్జ సంపత్ రెడ్డి, ఎంపీపీ తేజావత్ గోవర్ధన్నాయక్, జెడ్పీ కో-ఆప్షన్ మెంబర్ ఎండీ గౌస్, నర్మెట్ట-తరిగొప్పుల మండలాల పార్టీ కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, అధ్యక్షులు చింతకింది సురేష్, జగన్ మోహన్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు ఆమెడపు కమలాకర్ రెడ్డి, జార్జి రెడ్డి, ప్రధాన కార్యదర్శి కంతి రాజలింగం, తదితరులు పాల్గొన్నారు.