Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమ నుంచి వైదొలగి కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఎరువులపై రాయితీలు ఎత్తి వేసి, పంటలపై ఆంక్షలు విధిస్తూ విదేశీ విధానాలను అవలంభిస్తున్నాయని ఏఐకెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వసుకుల మట్టయ్య, ప్రధాన కార్యదర్శి వల్లెపు ఉపేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్లో ఏర్పాటు చేసిన ఏఐకెఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం లో వారు మాట్లాడారు. దేశ బడ్జెట్ ర.39.45 లక్షల కోట్లకు పెరిగినా ఒరిగేది ఏమీ లేదని అన్నారు. రైతన్నకు బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉంద ని అన్నారు. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పరిహారం చెల్లించే పరిస్థితి లేద ని అన్నారు. మద్దతు ధర, రుణ విముక్తి చట్టం ప్రస్తావన లేకపోవడం వివక్షకు నిదర్శనమని అన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలకు కేసీఆర్ పరోక్షంగా మద్దతు పలుకుతూ బయటికి మాత్రం విమరిిస్తున్నాడన్నారు. అటవీ హక్కుల చట్టం అమలు చేయకుండా పోడు భూముల నుంచి రైతులు వెళ్లగొట్టేందుకు కుట్రపన్నారని అన్నారు. పోడు రైతులకు హక్కు పత్రాలతోపాటు, వారిపై వేధింపులను ఆపాలని డిమాండ్ చేస్తూ రాజకీ యాలకతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.