Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దరఖాస్తులకు పరిమితమైన ప్రక్రియ
అ పరిష్కారంపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
అ గిరిజనులకు దక్కని హక్కు పత్రాలు
అ పోడు రైతుల దరి చేరని
ప్రభుత్వ పథకాలు
అ నేడు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్-భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా 11 మండలాల్లో 30 ఏండ్లుగా పోడు సమస్య అప రిష్కృతంగానే ఉండిపోయింది. పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ దరఖాస్తులు తీసుకొని ఏండ్లు గడుస్తున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోడు గిరిజనులకు ప్రభుత్వ ఫలాలు దక్కడం లేదు. అధికార యంత్రాంగం కూడా స్పష్టత ఇవ్వక పోవడంతో జిల్లాలో వేలాదిమంది పోడుదారులు భూమిపై హక్కులు పొందలేకపోతున్నారు. రైతు బీమా, బ్యాంకు రుణాలు తదితర ప్రయోజనాలకు దూరం కావాల్సిన పరిస్థితి. దీర్ఘకాలంగా ఈ సమస్యతో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించాలని ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. భూపాలపల్లి, గణపురం, రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల, కాటారం, మ లహా రావు, మహా ముత్తారం, మహాదేవపూర్, పలిమెల, మండలాల్లో మొత్తం 7లక్షల21వేల88 ఎకరాలను సుమారు 3వేల420మంది పోడు రైతులు సాగు చేస్తున్నారు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నాయకులు హామీలు ఇవ్వడం అధికారంలోకి రాగానే వాటి మర్చిపోవడం పరిపాటిగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి పోడు భూముల సమస్య లేకుండా శాశ్వతంగా పరిష్కరిస్తామని భరోసా ఇవ్వగా ఏడాదిన్నరగా అధికారులు దరఖా స్తులు స్వీకరించారు. ప్రతి గ్రామంలో ఫారెస్ట్ రైట్స్ కమిటీలు ఏర్పాటు చసి సర్వే ద్వారా భూముల హద్దులు గుర్తించి అర్హులందరికీ అందిస్తామని చెప్పారు. ఇందుకు సర్వే పరిశీలన కమిటీలతో పాటు హక్కు పత్రాలు జారీ చేసే విషయం కూడా స్పష్టంగా పేర్కొన్నారు. నెల రోజుల పాటు దరఖా స్తులు స్వీకరించి క్షేత్ర స్థాయి సర్వే చేపడతామని అన్నారు. కానీ, ప్రభుత్వ ఆదేశాలు రాక ఈ ప్రక్రియ కేవలం దరఖాస్తుల కే పరిమితమైంది. జిల్లాలో 2005 సంవత్సరం కంటే ముందే నుంచే వేలాది మంది గిరిజనులు పోడు భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. హక్కు పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ ప్రయోజనాలు రావడం లేదు.దీంతోపాటు ఎరువులు విత్తనాలపై రాయితీలు సౌకర్యాలను పొందలేకపోతున్నారు
నేడు జిల్లా కేంద్రంలో ధర్నా...
పోడు దారులకు హక్కు పత్రాలు కల్పించాలని అని డిమాండ్ చేస్తూ నేడు జిల్లా కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ దేవాలయం నుంచి జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించనున్నారు. ఆదివాసీ గిరిజన సంఘం నాయకులతో పాటు సిపిఎం నాయకులు హాజరు కావడంతపాటు పోడు రైతులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు.