Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ మండల కార్యదర్శి కూరపాటి విజరు కుమార్
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
నియోజకవర్గ సమస్యలను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సీపీఐ మండల కార్యదర్శి కూరపాటి విజరు కుమార్, తోట రమేష్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని ఛాగల్ గ్రామంలో మండల మహాసభ నాయకులు నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజక వర్గం అభివధి చెండాలంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వందపడకల దవాఖాన, లెదర్ పార్కు, లింగంపల్లి, ఉప్పుగల్లు రిజర్వాయర్లు తోపాటు పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గాండ్ల అజరు, యాదగిరి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.