Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
పోరాడి సాధించుకున్న జనగామ జిల్లాకు ఎన్నికల సందర్బంగా జనగామ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు నూకల ఐలయ్య, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రాపర్తి సోమయ్యడిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో లో ప్రతిపక్షాల సమావేశం ఈ సమావేశానికి అన్నభొఇన బిక్షపతిఅధ్యక్షత వహించగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న జనగామ జిల్లా అభివృద్ధిలో మాత్రం ఆమడదూరంలో ఉందని తెలిపారు. జిల్లా అభివృద్ధి పట్ల రాష్ట్రప్రభుత్వం జిల్లాకు చెందిన అధికారపార్టీ మంత్రి, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిం చారు. ఎన్నికల సందర్బంగా జనగామ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీనిచ్చి మోసం చేశారని గుర్తుచేశారు. జిల్లాలో వ్యవసాయరంగానికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కామోజీ టెక్స్ టైల్స్ పార్క్ పనులు ప్రారంభించి నిర్మాణం పూర్తిచేయాలని, జిల్లాలో ఇండిస్టియల్ కారిడార్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలిపారు. జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలో పాలకుర్తి, బమ్మెర పోతన, జఫర్ఘడ్ కోట, ఖిలాషాపుర్ సర్వాయిపాపన్న కోటతో పాటు రిజర్వాయర్లను పర్యాటక కేంద్రాలుగా అభివద్ధి చేయాలని తెలిపారు. జిల్లాలో నర్సింగ్, పాల్ టెక్నీక్ కాలేజీలు ఏర్పాటు చేయాలని, జిల్లాలోని ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న అన్ని కేటగిరిల పోస్టులను భర్తీ చేసి మెరుగైన వైద్యసేవలు అందుంచాలని తెలిపారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఎంఆర్ఐ, సిటీస్కానింగ్, స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వైద్యసేవలందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్లో నెలకొన్న స్థానిక సమస్యలు పరిష్కరించాలన్నారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జనగామ జిల్లాకు వస్తున్న సందర్బంగా ఇచ్చిన హామీలను పరిష్కరించి అన్ని రంగాలలో జిల్లాను అభివృద్ధి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ప్రతిపక్షాల నాయకులు సోము నారాయణ, మంచాల ఎల్లయ్య, కాటా సుధాకర్, నల్ల తీగల శ్రీను, నక్క యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.