Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి, కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి జన్మదిన వేడుకలను గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలకుర్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమార స్వామి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసు హరీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లాకు అనేక సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలలను అమలు చేయలేదన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభానికి వచ్చే సీఎం పర్యటనను అడ్డుకుం టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు భాస్కర్, భార్గవ్, ఐలేష్, ఎల్లయ్య, కుమార్, ఆదినారాయణ, శ్రీకాంత్, బాబు తదితరులు పాల్గొన్నారు.