Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మద్య మల్లీ ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ కార్యకర్తలు బుధవారం తమ పార్టీ కార్యకర్తలపైన దాడి చేశారని నిరసిస్తూ జనగామ పట్టణంలోని ఆంబేధ్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు గురువారం నిరసనకు దిగారు. దాడి చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని నినాదిం చారు. అప్పటికే సీఎం కేసీఆర్ కార్యక్రానికి జన సమీకరణ కోసం వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తల నినాదాలను టీఆర్ఎన్ నాయకులు అడ్డుకునే ందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీ శ్రేణుల మద్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ సేసి స్థానిక పోలీస్టేషన్‌కు, మరికొంతమంది బీజేపీ నాయకులను పార్టీ కార్యాలయానికి తరలించారు.