Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యా లయం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ పర్యటన అనంతరం జరిగే బహిరంగ సభ జనజాతరను తలపించాలని టీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగ సభను జయప్రదం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు గురువారం మండలంలోని పలు గ్రామాల్లో మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, జడ్పీ ఫ్లోర్ లీడర్ పూస్కూరి శ్రీనివాసరావు, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండీ మదర్‌తో పాటు టిఆర్ఎస్ నాయకులు వేర్వేరుగా గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. పాలకుర్తిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సీఎం బహిరంగ సభను జయప్రదం చేసేందుకు జనం భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ కన్వీనర్ చిక్కుడు రాములు, ఉపసర్పంచ్ తరాల చంద్రబాబు, వార్డు సభ్యులు రమేష్, లక్ష్మణ్, హనుమంత రావు, తదితరులు పాల్గొన్నారు.