Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జనగామ ప్రజలు చప్పట్లు కొడుతరు..
అ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
జనగామ జిల్లా గురించి సీఎం కేసీఆర్‌ను మేమేం అడుగదలుచుకోలేదని, సారే ఇస్తారని, జనగామ ప్రజలు రేపు చప్పట్లు కొడుతారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. గురువారం జనగామలో సీఎం పర్యటన ఏర్పాట్లలో భాగంగా నూతన సమీకృత కలెక్టర్ సముదా యం, టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం, బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. జనగామకు మెడికల్ కాలేజీని అడుగుతారా ? అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందిం చారు. జిల్లా ఏర్పాటు అనంతరం మొదటిసారి సీిఎం కేసీఆర్ జనగామకు శుక్రవారం వస్తున్నారని, ఆయనకు ఘనంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశామన్నారు. 70-80 వేల మందితో సభను నిర్వహించాలని భావించినా ప్రజల్లో స్పందన చూశాక 1,30,000మంది బహిరంగ సభకు వచ్చే అవకాశముందన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ జనగామకు చేరుకుంటారని, ముందుగా నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ సము దాయాన్ని సీఎం ప్రారంభిస్తారని, అక్కడే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుందన్నారు. అనంతరం జనగామ జిల్లా ప్రజాప్రతినిధులు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లతో సమావేశం ఉం టుందన్నారు. ఈ కార్యక్రమం ముగియగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటగా జనగామ జిల్లా టీఆ ర్ఎస్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ చేరుకొని ప్రారం భోత్సవం చేస్తారని, పార్టీ జిల్లా అధ్యక్షుడిని అధ్యక్షుడి కుర్చీలో కూర్చోపెట్టడం జరుగుతుందన్నారు. అక్కడే పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తారన్నారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు బహిరంగసభలో సీఎం ప్రసంగి స్తారన్నారు. ప్రధాని మోడీ విమర్శల నేపథ్యంలో టీఆర్ఎస్ బహిరంగసభకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సీఎం కేసీఆర్, టీిఆర్ఎస్ను కాపాడుకోవాలని పెద్ద ఎత్తున రానున్నార న్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జనగామ ప్రాంతం ఎడారి ప్రాంతంగా ఉండేదని, సీఎం కేసీఆర్ పాలనలో జనగామ జిల్లాగా ఏర్పడడమే కాకుండా దేవాదుల ప్రాజెక్టు నీటితో ప్రతి చెరువును నింపామన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరిచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంత చిన్న చూపు చూసినా దేశంలో అన్ని రంగా ల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉందన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకే జనగామ జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. లక్ష్యానికి మించి ప్రజలు బహిరంగ సభకు హాజరుకాను న్నారన్నారు. ప్రజాప్రతినిధులంతా ప్రజల మధ్యే కూర్చో వాలని సూచించారు. టీఆర్ఎస్ జనగామ జిల్లా ప్రతినిధులను అవసరమైతే ప్రగతిభవన్‌కు తీసుకుపోయి సీఎం కేసీఆర్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. బహి రంగసభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. 7 ఏండ్లుగా మోదీ విభజన హామిలను అమలు చేయలేదన్నారు. తిడితే సీఎం కేసీఆర్ తిట్టాలి కాని తెలం గాణ రాష్ట్రాన్ని తిట్టడమేమిటి ? అని ప్రశ్నించారు. అంబేద్క ర్ను ఎవరైనా విమర్శిస్తారా ? అని ప్రశ్నించారు. రాష్ట్రాలకు అధికారాలు లేకుండా చేస్తుండడమై సీఎం మాట్లాడారే తప్పా అంబేద్కర్‌ను విమర్శించలేదని, అయినా బిజెపి నేతలు ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్‌ను సీఎం కేసీఆర్ విమ ర్శించారని దుష్ప్రచారం చేశారన్నారు. టీఆర్ఎస్ నిరసన ర్యాలీ వేయిమందితో జరుగుతుంటే 10మంది బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడం ఎంత వరకు సబబు ? అని ప్రశ్నించారు. ఎవరి పార్టీ కార్యక్రమాలు వాళ్లు చేసుకోవాలని, అడ్డుకోవాలని చూసే సంస్కృతి మంచిది కాదని ఒక ప్రశ్నకు వివరణనిచ్చారు.
చరిత్ర తెలియకుండా మాట్లాడిన మోడీ
: మంత్రి సత్యవతి రాథోడ్
చరిత్ర తెలియకుండా ప్రధాని మోడీ మాట్లాడారని రాష్ట్ర గిరిజన సంక్షేమం మరియు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. చరిత్ర తెలియని మోదీ ప్రధాని కావడం దురదృష్టకరమన్నారు. దేశంలో బిజెపి వ్యతిరేక శక్తుల్ని కూడగట్టి నా మెడలు వంచుతారని భావించే ప్రధాని మోదీ తెలంగాణపై విషం కక్కుతు న్నారన్నారు. ఎడారిగా వున్న జనగామ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిసారి ఉద్యమసమయంలో బచ్చన్నపేటలో పర్యటించిన విషయాన్ని గుర్తుచేస్తుంటారన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన అందుబాటులోకి వచ్చింద న్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వికలాంగుల సహకార సంస్థ ఛైర్మన్ కె. వాసుదేవరెడ్డి, టిఎస్ఐఐసి ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, జడ్పీటిసి సభ్యులు గుడి వంశీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.