Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు భూక్య యాకన్న
నవతెలంగాణ-జఫర్గడ్
ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడి చేసిన పాలకుర్తి ఎస్సై వంశీకృష్ణను తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి భూక్య యాకన్న డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యాకన్నా పాల్గొని మాట్లాడుతూ... జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దడిగె సందీప్, మాలోతు తరుణ్ పై స్థానిక ఎస్సై చేసిన దాడిని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆంధ్ర పోలీసులతో దెబ్బలు తిన్నామని, నేడు తెలంగాణ వచ్చిన తరు వాత పోలీసులతో దెబ్బలు తినాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ వస్తే విద్యార్థుల బతుకులు మారుతాయనుకుంటే, విద్యా వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. వారికి తొత్తులుగా పోలీసులు మారారిన విమర్శించారు. తక్షణమే తమ సంఘానికి ఎస్సై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సైని సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. తమ పోరాటం ఆగదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మంజు భారు నాయకులు రాజు అక్షరు, రవళి, రశ్మిత, విష్ణు పాల్గొన్నారు.