Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య
తహశీల్దార్ కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పేదలకు ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య అన్నారు. సీపీఐ(ఎం) రంగశాయిపేట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాలు, గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలని గురువారం నగరంలో పేదలు భారి సంఖ్యలో ఎర్ర జెండాలు పట్టుకొని వచ్చి తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ పథకం నిరుపేదల్లో నిరుత్సాహాన్ని నింపిందన్నారు. తూర్పు నియోజకవర్గంలో పేదవాడికి ప్రభుత్వం నిలువ నీడ ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. పేదలకు ఇండ్ల స్థలాలకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని, లేకుంటే పేదలను సమీకరించి భూ పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అనంతరం పార్టీ రంగశాయిపేట ఏరియా కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో గుడిసెవాసులకు జీఓ 58, 59ప్రకారం పట్టాలు ఇచ్చి వ్యక్తిగత డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం చెప్పి ఏడేండ్లు గడిచిపోయిందని విమర్శించారు. గుడిసెవాసులకు పట్టాలివ్వాలని వ్యక్తిగత డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షాన భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహశీల్దార్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు టీ. రత్నం, ఎం. ప్రత్యూష, డీ సాంబమూర్తి, ఎస్ దాస్, ఎం జ్యోతి, బీ కష్ణ, ఓదేలు, ఎస్డీ ఫయాజ్, ఎండీ నజియా, కుమార్ తదితరులు పాల్గొన్నారు.