Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ జేఏసీ
నవతెలంగాణ- హన్మకొండ
ఏపీ జెన్కో మాస్టర్ ట్రస్ట్, ఏపీ ట్రాన్స్‌కో ఫండ్ నుంచి తెలంగాణకు జెన్కోకు, ట్రాన్స్‌కోకు రావలసిన పెన్షన్ ఫండ్‌ను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ జేఏసీ నాయకులు ఏ విజేందర్ రెడ్డి, కేవీ జాన్సన్, ఎన్ అశోక్‌లు డిమాండ్ చేశారు. గురువారం బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. విద్యుత్ విభజన చట్టం ఒకటి ప్రకారం 1999 ఫిబ్రవరి 1న ఉన్న ఏపీఎస్ఈబీని ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కో లుగా రెండు భాగాలుగా విభజించారని తెలిపారు. ఆనాడు ఏపీఎస్ఈబీలో ఉన్న యూనియన్స్ మధ్య ఉద్యోగుల పెన్షన్ భద్రత కోసం, జీత భత్యాలపై కొంత మొత్తాన్ని పెన్షన్, గ్రాట్యుటీ కోసం ఏపీ జన్కో, ట్రాన్స్‌కో వద్ద డిపాజిట్ చేయాలని ఒప్పందం జరిగిందన్నారు.
ఆనాటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తెలంగాణ ఉద్యోగులు డిపాజిట్ చేసిన మొత్తం డబ్బులు ఏపీ జెన్కో మాస్టర్ ట్రస్ట్ నుంచి తెలంగాణ జెన్కోకు రూ. 2172 కోట్లు, ఏపీ ట్రాన్స్‌కో నుంచి తెలంగాణ ట్రాన్స్‌కోకు రూ.712.10 కోట్లు రావాల్సి ఉందని, ఈ విషయాన్ని ఆమోదిస్తూ ఏపీ జెన్కో, ట్రాన్స్‌కోలు తీర్మానాలు చేశాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగులకు రావాల్సిన నిధులను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పెడచెవిన పెడుతోందన్నారు. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కో వద్ద గల ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన పెన్షన్ ఫండ్‌ను ఏపీ ఎస్ఈఎస్సీఎల్ కు ట్రాన్స్ఫర్ చేయాలని 2021 నవంబర్ 25న జీఓ నెం. 1998ను ఆంధ్ర ప్రభుత్వం విడుదల చేసి తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు అన్యాయం చేసే కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. వెంటనే తెలంగాణకు రావాల్సిన పెన్షన్ ఫండ్‌ను చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీ మహేందర్ రెడ్డి, ఎస్ మల్లికార్జున్, కే గౌతమ్, వీ వేణు బాబు, ఎం హేమంత్, బీ ప్రభాకర్, చంద్రశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.