Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
తెలంగాణలో అవినీతి రాజకీయాలు అంత మొందించాలని ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింగపురం సమ్మయ్య అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. రాజాకీయ పార్టీలు కోట్లలో ఆస్తులు ఉన్నవారికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తున్నారని, ఇది సమంజసం కాదన్నారు. ఎన్నికల్లో నిల్చున్న ధనికులు డబ్బులు పంచడం వల్ల దేశంలో, రాష్ట్రంలో అవినీతి రాజకీయం రాజ్యమేలుతోందన్నారు. రాబోవు ఎన్నికల్లో పేదవారికి టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పొటీ చేస్తామని తెలిపారు . ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు గాదె రాములు, మండల ఇంఛార్జి బట్టు స్వామి, మండలాధ్యక్షుడు అయిలపాక స్వామి, బట్టు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.