Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మా దనంతో విద్యార్థుల మధ్య చిచ్చు పెడుతోందని, విద్యను కాషాయీకరణ చేయడం కోసం ప్రయత్నిస్తోందని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున అన్నారు. మార్తా నాగరాజు అధ్యక్షతన గురువారం స్థానిక ఓంకార్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోదో అండ దండలతో ఫాసిస్టుల దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని వాపోయారు. విద్యార్థుల మధ్య కులాల చిచ్చు పెడుతూ.. భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ముస్లిం మహిళలు హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయ మొక్కలను రెచ్చగొడుతు ముస్లిం మహిళలకు విద్యను దూరం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇలాంటి దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ఇకనైనా ప్రభుత్వాలు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో నాయకులు గూడా సాయిరాం వర్మ, గనిపాక బిందు, సాగర్, సాయి కుమార్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.