Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఎం కేసీఆర్‌తో రాలేదు తెలంగాణ..
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి
నవతెలంగాణ-హసన్‌పర్తి
సీఎం కేసీఆర్‌తో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగలేదని, 12వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌రెడ్డి అన్నారు. హసన్‌పర్తి 66వ డివిజన్ కేంద్రంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భతి అందించాలని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికో ఉద్యోగం అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మొండి తీరుపై బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేస్తున్నట్టు చెప్పారు. ప్రజలు ఈ ఉద్యమానికి బ్రహ్మరథం పట్టి మద్దతు తెలుపుతున్నారన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు అర్థం చేసుకోని ఒక వెర్రి ముఖ్యమంత్రి కెేసీఆర్ అని, హిందీ భాష రాకపోతే నేర్చుకొమ్మని హితవు పిలికారు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ పాలనకు అంతం తప్పదని హెచ్చరించారు. టీఆర్ఎస్ గుండాలు మోదీ దిష్టిబొమ్మ దహనం చేసిన స్థలం వద్ద సంప్రోక్షణ నిర్వహించి పాలతోశుద్ధి చేసి క్షీరాభిషేకం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్ర మంలో కార్పోరేటర్ గురుమూర్తి శివకుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి గుండమీది శ్రీనివాస్, వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ తాళ్లపెల్లి కుమారస్వామి, బీజేవైఎం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు తీగల భరత్ గౌడ్, హసన్‌పర్తి మండల అధ్యక్షుడు కడిపికొండ సంతోష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మేకల హరిశంకర్, ఉపాధ్యక్షులు బండారి శేఖర్, బీజైవైఎం జిల్లా అధికార ప్రతినిది కందుకూరి సాయిచందు పాల్గొన్నారు.