Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-హసన్ పర్తి
గృహ ప్రవేశం కోసం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి తప్పి పోయిన ఐదేండ్ల బాలికను క్షణాల్లో తల్లిదండ్రులకు కేయూ పోలీసులు గురువారం అప్పగించారు. దీంతో వారిని సీసీ తరుణ్ జోషి అభినందించారు. వివరాల ప్రకారం.. గోపాల్పూర్లోని అమ్మమ్మ ఇంటికి తన తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ నుండి ఐదేండ్ల బాలిక వచ్చింది. ఈ క్రమంలో స్థానిక పిల్లలతో కలసి ఆడుకుంది. అనంతరం ఇంటి వెళ్లేందుకు దారి మర్చిపోయి రోడ్డుపై నిల్చుని ఏడుస్తోంది. ఆ ప్రాంతానికి వచ్చిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్స్ యుగంధర్, సతీష్ కుమార్ తప్పినపోయిన బాలికను వివరాలు అడిగారు. కాగా బాలిక తన తల్లిదండ్రుల పేర్లు, స్కూల్ పేరు మాత్రమే తెలియజేయడంతో అప్రమత్తమైన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్లు బాలికను కెేయూసీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తల్లిదండ్రుల అడ్రస్ కోసం తప్పి పోయిన బాలిక ఫోటోను పోలీసులు వివిధ సామాజిక మాద్యామాల్లో పోస్ట్ చేశారు. దీంతో సమాచారం పాప తల్లికి తెలియగా.. కేయూ సీఐ జనార్థన్ సంప్రదించండంతో బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్లు తిరిగి బాలికను తల్లికి అప్పగించారు. తప్పినపోయిన తన కుమార్తెను క్షేమంగా తమకు తిరిగి అప్పగించినందుకు తల్లిదండ్రలు బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్లు యుగేంధర్, సతీష్ కుమార్తో పాటు సీఐకి కృతజ్ఞతలు తెలిపారు.