Authorization
Tue March 11, 2025 02:21:37 am
నవతెలంగాణ కాశిబుగ్గ
భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ వరంగల్ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ జన్ను మధుకర్ డిమాండ్ చేశారు. 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని విమర్శించడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ డివిజన్ కన్వీనర్ ఈర్ల అగస్టిన్, కొమ్ము ప్రణరు, మహాజన ఫ్రెంట్ స్టూడెంట్ యూనియన్ కన్వీనర్ మంద వినరు ముదిరాజ్, జక్కుల ప్రశాంత్, గడ్డం బన్నీ పాల్గొన్నారు.