Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏసీపీ కలకోట గిరికుమార్
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
డ్రగ్స్ నిర్మూలన ఉద్యమంలో విద్యార్థులు భాగస్వామ్యం వహించాలని ఏసీపీ కలకోట గిరికుమార్ పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని సీకేఎం కళాశాలలో ఇంతేజార్గంజ్ పోలీసుల ఆధ్వర్యంలో 4జీ నిర్మూళన కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ వ్యతిరేక సదస్సులో భాగంగా 200మంది విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మాట్లాడారు. మాదకద్రవ్యాల గురించి ఎటువంటి సమాచారమున్న వెంటనే పోలీస్లకు చేరవేయాలన్నారు. గంజాయి, గుట్కా, గుడుంబా,గ్యాంబ్లింగ్(4జీ)లను పూర్తిగా అంతం చేయడానికి అన్ని వర్గాల భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ డీ మల్లేశ్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అంజిత్ రావు, ఎస్ఐ శ్రీకాంత్, కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్ రావు, ఆచార్య మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.