Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
సంవత్సర కాలంలో తల్లిదండ్రుల మృతితో అనాథలుగా మిగిలిన చిన్నారుల విషాద గాథ మండలంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే...మండలంలోని తిప్పన్న పల్లి గ్రామానికి చెందిన అంచా అప్పారావు (43) గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానలకు వెళ్లిన ఆయన చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. అంతకు మునుపే ఏడాది క్రితం భార్య కోటేశ్వరి (33) అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో వీరిరువురి సంతానమైన ఉషారాణి (10), సాయి వైష్ణవి (7) అనాథలుగా మిగిలారు. తల్లి మృతి చెంది సంవత్సరం గడవక ముందే తండ్రిని కోల్పోవడంతో ఆ చిన్నారుల రోధన అక్కడి ప్రజలను కంటతడిపెట్టించింది. పసివయసులో అనాథలుగా మిగిలిన చిన్నారులను ప్రభుత్వం చొరవ చూపి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.