Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మండలంలోని వల్లెంకుంటగ్రామానికి చెందిన జాగిలపు సంపత్ కు అనారోగ్యం కారణంగా ప్రయివేటు హాస్పిటల్లో చేరి ఖర్చులపాలయ్యాడు.ముఖ్యమంత్రి సహయనిది ద్వారా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు రూ. 60 వేల రూపాయల చెక్కును మంజూరు చేయించగా శుక్రవారం వల్లెం కుంట గ్రామ సర్పంచి శనిగరం రమేష్ బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఉపసర్పంచ్ కొండూరు మమత సింగిల్ విండో డైరెక్టర్ బొమ్మ రమేష్ రెడ్డి . కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల రవి, కటకం శ్రీనివాస్, నారా రాజ సమ్మయ్య, డీజే శ్రీనివాస్ పాల్గొన్నారు.