Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తూర్పు ఎమ్మెల్యే నరేందర్
నవతెలంగాణ-కాశిబుగ్గ
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివద్ధి పరుస్తున్న కెసిఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జనగామలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు శుక్రవారం ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో ఓ సిటీ గ్రౌండ్ నుండి పదివేల మందితో భారీ ర్యాలీ నిర్వహించి డప్పు చప్పుల్లతో, గుస్సాడి నత్యాలతో 150 బస్సులతో పాటు ఇతర వాహ నాలలో భారీగా తరలి వెళ్లారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ దేశంలో బీజేపీకి కాలం చెల్లిందని, అభివద్ధి చేతగాని నరేంద్ర మోడీ రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తూ తెలంగాణపై విషం కక్కుతున్నారని మండి పడ్డారు. తెలంగాణలో కేసీఆర్ చేపట్టిన కార్యక్ర మాలు దేశంలో చేపట్టాలని ప్రజల నుండి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేకే ప్రధాని మోడీ కెసిఆర్ పై చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివద్ధికి నిధులు ఇవ్వకపోగా తెలంగాణను అవమా నిస్తుంటే బీజేపీ నాయకులు సిగ్గులేకుండా మోడీ అడుగులకు మడుగులొత్తుతున్నరని మండిపడ్డారు. పదివేల మందితో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, చైర్మన్ లు, పాల్గొన్నారు.